Poems

Desamunu Preminchumanna Geyam In Telugu

దేశమును ప్రేమించుమన్నా
మంచి అన్నది పెంచుమన్నా
వొట్టి మాటలు కట్టి పెట్టోయ్
గట్టి మేల్ తలపెట్టవోయ్


ఈసురోమని మనుషులుంటే
దేశమే గతి బాగుపడునోయ్
తిండి కలిగితే కండ కలదోయ్
కండ గలవాడేను మనిషోయ్

దేశాభిమానం నాకు కలదని
వొట్టి గొప్పలు చెప్పుకోకోయ్
పూని ఏదై నాను ఒక మేల్
కూర్చి జనులకు చూపవోయ్


సొంత లాభం కొంత మానుకు
పొరుగు వాడికి తోడుపడవోయ్
దేశమంటే మట్టి కాదోయ్
దేశమంటే మనుషులోయ్


చెట్టపట్టాల్ పట్టుకుని
దేశస్థులంతా నడువవలెనోయ్
అన్నదమ్ముల వలెను జాతులు
మతములన్నియు మెలగవలెనోయ్


శ్రీ గురజాడ అప్పారావు


Post a Comment

0 Comments