Paramanandayya Sishyulu Katha - Gurram Guddu Katha

Paramanandayya Sishyulu Katha - Gurram Guddu Katha




అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఒక గురువు ఉండేవారు. ఆయన పేరు పరమానందయ్య. ఆయనకు చాలా మంది శిష్యులు ఉండేవారు. వాళ్లు తెలివితక్కువ పనులు చేసేవారు.వాళ్లు చేసే పనులు మనకి నవ్వు పుట్టిస్తాయి. వాళ్ల అమాయకతకు మనకు జాలి కలుగుతుంది. వాళ్ల గురించి చాలా కథలు ఉన్నాయి. అందులో ఒకటి గుర్రం గుడ్డు కదా.
   
        ఒకరోజు శిష్యులందరూ పరమానందయ్య చుట్టూ చేరి కూర్చున్నారు. అప్పుడే పాఠాలు చెప్పడం పూర్తయింది. పరమానందయ్య తన శిష్యులతో "శిష్యులారా! నాకు ముసలితనం వస్తుంది. నేను మునుపటిలా నడవడం చేతకాదు. గ్రామాలు తిరగటం కష్టంగా ఉంది. కనుక మీరు ఎక్కడికైనా వెళ్లి ఒక మంచి గుఱ్ఱం గొడ్డు కొని తీసుకు వస్తారా!" అని వంద రూపాయలు ఇచ్చాడు దానికి శిష్యులందరూ ఎంతో ఉత్సాహంతో " అది ఎంత పని  గురువుగారు అలాగే తీసుకువస్తాం అని అంటారు. గురువు "గుఱ్ఱం గొడ్డు"  అన్నప్పుడు శిష్యులకు "గుఱ్ఱం గుడ్డు" అని వినిపించింది.

      శిష్యులు ఊరూరు వాడవాడా తిరిగి కనిపించే వాళ్లందరినీ "అయ్యా మీ దగ్గర గుఱ్ఱం గుడ్డు ఉందా "?మేము కొంటాం వంద రూపాయలు ఇస్తాం అని అడుగుతూ వెళ్లారు. గుర్రం గుడ్డు ఎక్కడ ఉంటుంది అయ్యా మీకేమైనా మతి పోయిందా అని కొందరు నవ్వి పోయారు. కొందరు మీకు బుద్ధి లేదని అన్నారు. కొందరు మమ్మల్ని పరిహాసం చేస్తారా  ఎక్కడైనా గుఱ్ఱం  గుడ్డు ఉంటుందా వెళ్ళండి అని కోపంతో మందలించారు. వాళ్లకు ఎక్కడ గుర్రం గుడ్డు దొరకలేదు మరొక గ్రామానికి వెళ్లారు.





      ఆ వూరిలో ఒక మోసగాడు ఉండేవాడు. ఆ మోసగాడు వీళ్ళ అమాయకత్వాన్ని చూసి మోసం చేయాలనుకుంటాడు.శిష్యులు అతని దగ్గరికి వెళ్లి "అయ్యా మీ దగ్గర గుఱ్ఱం గుడ్డు ఉందా మేము కొంటాము" అని అడుగుతారు దానికి అతను నా దగ్గర ఉంది కానీ......... అని అంటాడు. దానికి శిష్యులు కానీ... ఏమిటి మేము వంద రూపాయలు ఇస్తాము ఆ గుడ్డు మాకు ఇవ్వండి అని అడుగుతారు. నాకు వంద రూపాయలు సరిపోవు రెండు వందలరూపాయలు ఇస్తే ఆ గుడ్డు మీకు ఇస్తాను అని అంటాడు. అప్పుడు శిష్యులు ఇలా అంటారు "బాబు బాబూ!  మా గురువుగారు అంత పెట్టుకోలేరు దయచేసి నూరు  రూపాయలకే ఆ గుడ్డు మాకు ఇవ్వండి" అని బ్రతిమాలుతారు. ఆ మోసగాడు కాసేపు బేరమాడి నట్టు నటించి  చివరికి వంద రూపాయలకు ఇవ్వడానికి ఒప్పుకుంటాడు. శిష్యులు అందరిని వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్తాడు.

       వాళ్ళ ఇంట్లోకి వెళ్లి ఉట్టి మీద  వున్న  బూడిద గుమ్మడికాయ ను తీసుకువచ్చి "ఇదిగో నండి గుఱ్ఱం  గుడ్డు, మీ గురువుగారు అదృష్టం మంచిది. వంద రూపాయలుకే ఇస్తున్నాను. దీనిని  కింద  పెట్టకుండా జాగ్రత్తగా తీసుకెళ్లండి ఇంకో రెండు మూడు రోజుల్లో ఇది పగిలి పిల్ల అవుతుంది.  అని ఉట్టి ని వారికి అందించినాడు శిష్యులు దాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ ఒకరి తర్వాత ఒకరు చేతులు మార్చుకుంటూ వెళ్తున్నారు. ఇంతలో మధ్యాహ్నం అయింది. ఆకలితో నకనకలాడిపోతున్నారు. దారిలో ఒక మండపం కనిపించింది. అక్కడ వంట చేసుకుని భోజనం చేసి ముందు ప్రయాణం సాగిస్తాం అనుకున్నారు. దగ్గరే ఉన్న ఒక చెట్టు కొమ్మకు ఉట్టిని కట్టి అందరూ వంట కార్యక్రమంలో ఉండిపోయారు.




     కొంచెం సేపటికి ఆ చెట్టుకు కట్టిన ఉట్టి  వూగి వూగి తెగి కింద ఉన్న పొదల్లో పడింది. ఆ పొదలో ఉన్న జింకపిల్ల భయపడి ఒకే పరుగు తీసింది. శిష్యులు జింక పిల్లను చూసి "గుఱ్ఱం  గుడ్డు పగిలింది పిల్ల పారిపోతుంది. రండి రండి రా !" అని అందరూ దాని వెంట పడ్డారు. దాదాపు క్రోసు దూరం పరుగెత్తారు.అది దొరకలేదు జింక తో సమానంగా వాళ్లు పరిగెత్తగలరా? దాన్ని పట్టుకో గలరా !పైగా ఆకలితో అలసిపోయారు. చివరకు అందరూ ఒకచోట చేరి "ఒరేయ్ ! దాన్ని పట్టుకోవడం మన వల్ల కాదు. పోతే పోయింది. వెళ్లి  గురువు గారికి జరిగిన సంగతి చెబుదాం "అని అందరూ ఇంటి దారి పట్టారు.

        గురువుగారు వాళ్లను చూసి 'తెచ్చారా గుఱ్ఱాన్నీ '  అని అడిగారు. అందుకు వాళ్లు "గురువుగారు ! ఎట్లో  కష్టపడి ఊరూరు తిరిగి  చివరకు ఒక గుఱ్ఱం గుడ్డు కొన్నాం. 100 రూపాయలకే కొన్నాం. ఉట్టి తో సహా కొన్నాం. ఉట్టినీ  ఒక చెట్టుకు కట్టి వంట పనిలో పడ్డాం. గుడ్డు పగిలింది.పిల్ల  పరిగెత్తింది. మేము దాని వెంట పడ్డాము. ఏం వేగం ఏం వేగం!  అది మాకు చిక్కలేదు. గురువుగారు! అది పోయిందే good. అంత వేగంగా పరుగెత్తే గుర్రం పైన తమరు సవారీ  చేయగలరా! చేసిన మీరు మాకు దక్కగాలరా!" అన్నారు.

    గురువుగారు వారి మాటలు విని 'ఓరి పిచ్చి సన్నాసుల్లారా! గుఱ్ఱం  గుడ్డు ఎక్కడైనా ఉంటుందా? ఎవడో మీకు మోసం చేశాడు అని వాళ్ళ తెలివితక్కువ పనికి నవ్వుకున్నాడు.




- Taatayya Kathalu


       

Post a Comment

0 Comments