పూర్వం లక్ష్మీపురం అనే గ్రామంలో ఒక ఆవు ఉండేది. ఆ ఆవు రోజు మందతో కలిసి పక్కనే ఉన్న అడవికి మేతకు వెళ్ళేది. సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చేది. ఒక చక్కటి లేగదూడ పిల్ల కూడా ఉంది.
ప్రతి రోజు లాగానే ఆ మరుసటి రోజు కూడా అడవికి మేతకు వెళ్ళింది. మధ్యాహ్నం సమయానికి ఏదో ఒక రాయి తగిలి ఆవు కాలికి గాయం అయింది. సాయంత్రం కూడా కావస్తోంది. ఇంతలో ఆవుల మందలు అన్ని ఇంటికి వెళ్ళడం మొదలుపెట్టాయి.
ఆరోజు గడ్డి మేస్తున్న ప్రదేశం చాలా బాగుంది. గడ్డి ఎక్కువగా మేస్తే పాలు తన బిడ్డకి మరియు యజమానికి సమృద్ధిగా అందుతాయని ఆవు అనుకుంది. కొంచెంసేపు గడ్డి మేసి వెళ్ళిపోవచ్చు అనుకుంది. ఈ లోపల అడవి నుండి మిగతా ఆవుల మందలు అన్నీ ఊరు వైపు వెళ్ళి పోయాయి.
ఈ ఆవు మాత్రం గడ్డి మేస్తూ సమయం మర్చిపోయింది. ఇంతలో చుట్టుపక్కల చీకటి పడుతుండటంతో తిరిగి ఇంటికి వెళ్ళాలని నిర్ణయించుకుంది. ఆవు కాలికి గాయం తగలడం వల్ల, వేగంగా నడవ లేక పోయింది. మెల్లగా కుంటుకుంటూ నడుస్తూ ఊరు వైపుగా అడవి నుండి వస్తున్న సమయంలో మధ్యలో ఒక పులి ఎదురుపడింది.
ఆ పులికి రెండు రోజులుగా ఆహారం దొరకడం లేదు. కాబట్టి ఎంతో ఆకలి తో ఉంది. అలాంటి సమయంలో ఆవు కంట పడడంతో తనకు మంచి ఆహారం లభించని అనుకుంది.
అప్పుడు పులి ఆవు తో ఏ విధంగా అంటుంది. రెండు రోజుల నుంచి ఆహారం దొరక్క చాలా ఇబ్బంది పడుతున్నాను. సరైన సమయంలో నువ్వు కనిపించావు. ఒక వారానికి సరిపడా ఆహారం గా అవుతావు. ఇక నువ్వు తప్పించుకోవడం అసాధ్యం. నిన్ను ఇప్పుడే చంపి నా ఆకలి తీర్చుకుంటాను. .
దానికి వెంటనే ఆవు ' నువ్వు చెప్పింది నిజమే. నన్ను కాపాడతం ఎవరివల్లా కాదు. ఇప్పుడు నువ్వు నన్ను చంపి తినొచ్చు. కానీ నాది ఒక చిన్న విన్నపం ఉంది. దయచేసి.. నేను చెప్పేది విని, నా యొక్క చివరి కోరికను తీర్చు. అని అంటుంది.
దాని కి పులి '' ఏమిటి, నీ చివరి కోరిక తీర్చా లా?? . అయినా నేను ఎందుకు నీ కోరిక తీర్చాలి. నేను నిన్ను చంపి ఇప్పుడే తినేస్తాను. అని ఆవును చంపడానికి ముందుకు వెళ్తుంది.
ఇంతలో ఆవు పులితో ఈ విధంగా..అంటుంది. నువ్వు ఫులివి మూవీ. నాకంటే ఎంతో బలమైన, క్రూరమైన జంతువువి. నువ్వు నేను చెప్పేది మొత్తం విని మా యొక్క చివరి కోరికను తీర్చిన వలసిన అవసరం లేదు. నువ్వే అన్నావ్ కదా నేను నీకు వారం సరిపడా ఆహారం అవుతానని. ఆ విధంగా నేను నీకు వారానికి సరిపడే ఆహారం గా ఉపయోగపడతాను. కనీసం అందుకోసమైనా. ఒక్కసారి నేను చెప్పేది విను. నేను నిన్ను వేడుకుంటున్నాను. అని అంటుంది.
దానికి పులి సరే చెప్పు అంటుంది. నాకు ఒక చిన్న లేగదూడ ఉంది. అది రోజు నేను ఇంటికి వచ్చి పాలు ఇస్తాను అని ఎదురుచూస్తూ ఉంటుంది. ఆకలికి ఎక్కువసేపు తట్టుకోలేదు. నేను ఇంటికి తిరిగి వెళ్లి, నా బిడ్డకు పాలు ఇచ్చి మళ్ళీ తిరిగి అడవికి వస్తాను. అప్పుడు నువ్వు నన్ను చంపి తినవచ్చు అని ఆవు పులితో అంటుంది.
అది విన్న పులి, నేను ఏమైనా వెర్రి వాడిని అనుకుంటున్నావా! నిన్ను ఇప్పుడు విడిచి పెడితే నువ్వు మళ్ళీ తిరిగి రావు. నా ఆహారం వృధా అవుతుంది. నాకు మళ్ళీ ఇంత మంచి ఆహారం దొరకదు. అని అంటుంది.
దానికి ఆవు ' నేను ఇప్పుడు వెళ్లి తిరిగి రాకపోతే మళ్ళీ రేపు మేత మెయ్యడానికి ఆవుల మందతో కలిసి అడవికి వస్తాను కదా! అప్పుడు నువ్వు నన్ను వెంటనే చంపి తినుచు. నా కాలికి గాయం తగిలి ప్రస్తుతానికి నేను కుంటి ఆవుగా ఉన్నాను. కావున నీ నుంచి తప్పించుకునే అవకాశం ఉండదు. దయచేసి నా మాట నమ్ము. ఆ బిడ్డకు పాలు ఇచ్చి ఇప్పుడే మళ్ళీ తిరిగి వస్తాను అని అంటుంది.
ఆవు చెప్పింది మొత్తం విన్న పులి, సరే అయితే.. ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్లి నీ బిడ్డకు పాలిచ్చే తిరిగి రా. అంతవరకు నేను ఇక్కడే వేచి ఉంటాను అని ఆవుని విడిచి పెడుతుంది.
ఆ మాటకు ఎంతో సంతోషించి న ఆవు అక్కడినుంచి బయలుదేరి ఇంటికి వస్తుంది. తన బిడ్డకు పాలు ఇచ్చి, అన్ని మంచి బుద్ధులు చెబుతోంది. ఒంటరిగా అడవికి ఏప్పుడు వెళ్లవద్దని చెబుతుంది. ఎవరి పంటను నాశనం చేయవద్దని చెబుతుంది. బుద్ధిగా యజమాని చెప్పింది విని, సమయానికి భోజనం చేసి మంచి గా ఉండమని చెబుతుంది.
ఆ మాటలు విన్న లేగదూడ ఈ విధంగా అడుగుతుంది. ఎప్పుడూ లేనిది ఈ రోజు ఎందుకు అమ్మా ఇన్ని నీతులు చెప్తున్నావు. ఎక్కడికైనా వెళ్తున్నావా అని అడుగుతుంది. దానికి ఆవు అవునమ్మా.. నేను పనిమీద పక్క ఊరికి వెళ్తున్నాను. తిరిగి రావడానికి సమయం పడుతుంది. అందుకే ముందుగా నీకు ఇవన్నీ చెప్తున్నాను అని అంటుంది.
ఆ తర్వాత ఆవు.. చివరిసారిగా తన బిడ్డను కళ్ళారా చూసుకు ని, అక్కడి నుంచి అడవికి బయలుదేరుతుంది.
కొంతసేపటికి ఆ అడవికి చేరుకుంటుంది. ఆవు అక్కడ వున్న పులి దగ్గరికి వెళ్లి, నేను చెప్పిన మాటను విని.. చివరిసారిగా నా బిడ్డకు ఆహారం ఇచ్చే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపింది. ఇప్పుడు నువ్వు నన్ను చంపి, నీ ఆకలిని తీర్చుకోవచ్చు అని అంటుంది.
అది విన్న పులి, ఆవు నిజాయితీకి ఆశ్చర్యపోతుంది. ఆవుకి తన బిడ్డ పై ఉన్న మమకారాన్ని మెచ్చి.. ఆవుని విడిచి పెడుతుంది.
నువ్వు నీ బిడ్డ తో కలిసి సంతోషంగా జీవించు. నేను ఇంకేదైనా ఆహారం వెతుక్కుంటాను అని పులి ఆవుతో అంటుంది.
ఆ మాటకు ఎంతో సంతోషపడిన ఆవు.. తిరిగి ఇంటికి వెళ్లి తన బిడ్డతో కలిసి హాయిగా జీవనం సాగిస్తుంది.
- Taatayya Kathalu
- Taatayya Kathalu


0 Comments