ఒకరోజు అవసరార్థం వారు తమ పొరుగూరు ప్రయాణమయ్యారు. వారితో పాటు తాము పెంచుకుంటున్న గాడిదను కూడా తీసుకు వెళ్లారు. తండ్రి కొడుకులు ఇద్దరూ గాడిద పైన ఎక్కితే.. దానికి ఇబ్బందిగా ఉంటుందని, కొడుకు మాత్రమే గాడిద పై కూర్చుని తండ్రి గాడిద వెంట నడుస్తూ తమ ప్రయాణాన్ని సాగిస్తున్నారు.
అలా కొంత దూరం వెళ్ళాక.. తమ ప్రయాణ మార్గం లో ఉన్నటువంటి కొంతమంది వీళ్ళను చూసి, వయసులో పెద్దవాడైన తండ్రిని నడిపిస్తూ నేను మాత్రం గాడిదపై కూర్చుని వెళుతున్నాడు. తండ్రిపై అసలు అతని కి గౌరవం కూడా లేదు అని అనడం మొదలు పెట్టారు.
అది విన్న కొడుకు, వెంటనే గాడిద పై నుండి కిందకు దిగి, తన తండ్రిని గాడిద పైన ఎక్కించి తమ ప్రయాణాన్ని మొదలుపెట్టారు.
అలా కొంత దూరం వెళ్ళాక.. ఎదురుగా వస్తున్న కొంత మంది ప్రయాణికులు, వీళ్ళను చూసి ఈ విధంగా అనుకున్నారు.
కొడుకును తన వెంట నడిపిస్తూ, తను మాత్రం హాయిగా గాడిదపై కూర్చుని వెళ్తున్నాడు. ఈ తండ్రికి దయ, కరుణ ఏమీ లేవు. అని తండ్రిని తప్పుబట్టారు.
అది విన్న తండ్రి, చివరకి తన కొడుకును కూడా గాడిదపై ఎక్కించుకున్నాడు. ఇద్దరు గాడిదపై కూర్చుని తమ ప్రయాణాన్ని మొదలుపెట్టారు.
అలా కొంత దూరం వెళ్ళాక.. అటుగా వస్తున్న ప్రయాణికులు వీళ్ళను చూసి ఇంకో విధంగా అన్నారు. నోరులేని జీవాల్ని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు. అంత చిన్న గాడిదపై ఇద్దరు కూర్చున్నారు. వీళ్లకు అసలు మానవత్వం అనేదే లేదు. ఆ గాడిద మూగ ప్రాణి కరుణ కూడా లేదు. ఇద్దరూ అలా ఎక్కి కూర్చోకపోతే, ఎవరో ఒకరు ఎక్కి.. ఒకరు నడుస్తూ రావొచ్చు కదా! అని అనడం మొదలు పెట్టారు.
ఇది మొత్తం విన్న తండ్రి కొడుకులు.. వారికి ఏం చేయాలో అర్థం కాక, ఇద్దరు కూడా గాడిద నుండి కిందకి దిగి పోయారు. గాడిదను ఒక గుడ్డ చుట్టి పొడవాటి కర్రకు కట్టి, తండ్రి కొడుకులు ఇద్దరూచెరోవైపు పట్టుకుని గాడిదని మోస్తూ ప్రయాణాన్ని సాగించారు.
చివరకు ఎలాగోలాగా తమ పొరుగు ఊరు చేరుకున్నారు. అక్కడ వీరిని చూసి అంతా నవ్వసాగారు. తమ దగ్గర గాడిది ఉంచుకుని, గాడిదపై కూర్చుని హాయిగా రాకుండా, గాడిద ను వీళ్లే మోసుకుంటూ వస్తున్నారు!!! ఇది ఎంతో ఆశ్చర్యం గా ఉంది.. అంటూ పక పకా నవ్వసాగారు.
దీన్నిబట్టి అందరికీ ఒక విషయం అర్థమైంది. ఈ ప్రపంచంలో మనం ఏ పని చేసినా.. దానిలో ఏదో ఒక తప్పును వెతుకుతూ ఉంటారు. కాబట్టి ఎవరు ఏమనుకున్నా మనకు నచ్చిన దారిలో నచ్చినట్టుగా వెళ్లడం మంచిది. మన కెరియర్ లో ఏదైనా ఒక గోల్ ని పెట్టుకుని, దాని కోసం మనం ముందుగా ఒక ప్రణాళిక వేసుకొని, ఎవరు ఏమనుకున్నా వినకుండా, చివరకు మన యొక్క లక్ష్యాన్ని చేరుకోవాలి.
- తాతయ్య కథలు.
- Taatayya Kathalu
- Taatayya Kathalu


0 Comments