Ghost Mother Story In Telugu (Part-1)
దెయ్యం అమ్మ కథ - (పార్ట్ - 1)
దెయ్యం అమ్మ కథ - (పార్ట్ - 1)
దెయ్యం అమ్మ కథ :
అనగనగా ఒక వూరు ఆ వూరు లో రాము అని ఒక పిల్లాడు ఉండేవాడు. రాము తల్లితండ్రులు అతని చిన్నప్పుడే చనిపోయారు . రాము గ్రామంలో వాళ్లు వీళ్లు పెట్టేది తింటూ తన జీవనం కొనసాగించి వాడు .కొన్నాళ్ళు గడిచిన తర్వాత రాము కొంచెం పెద్దవాడయ్యాడు.
ఊళ్ళో వాళ్ళు చెప్పిన పనులు చేస్తేనే అతనికి ఆ రోజు భోజనం దొరికేది. లేకపోతే వస్తువుని ఉండాల్సిందే. అలా ఒకరోజు రాముకి ఏ పని దొరకకపోవడంతో మూడు రోజులు పాటు రాముకి ఆహారం కూడా దొరకదు.
రాము కి బాగా ఆకలి వేస్తుంది ఊళ్ళో వాళ్ళని తినడానికి ఏమైనా పెట్టమని అడుగుతాడు. పాపం ఎవరు ఏమి పెట్టారు. అప్పుడు రాము ఆ గ్రామ సర్పంచ్ గారి దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు. అయ్యా నాకు మూడు రోజుల నుండి ఏ పని దొరకక పోవడంతో ఆహారం కూడా దొరకలేదు. బాగా ఆకలి వేస్తుంది, మూడు రోజుల నుండి ఏం తినలేదు. మీరే ఎలాగైనా భోజనం పెట్టండి అని అంటాడు.
అప్పుడు ఆ గ్రామ సర్పంచ్ వెళ్ళు వెళ్ళు మేము ఇక్కడ ఏమైనా హోటల్ తెరిచి కూర్చున్నమా ఏంటి అని కోపంగా అన్నాడు. అప్పుడు రాము అయ్యా అలా అనకండి మీ కాళ్లు పట్టుకుంటాను దయచేసి మీరే నాకు ఏదైనా పని చెప్పి భోజనం పెట్టాలి అని ప్రాడేయపడతాడు.
అప్పుడు ఆ సర్పంచ్ నా దగ్గర పని లేదు పో అంటాడు. ఆ మాటలు విన్న పక్కనే వున్న ఒక ముసలాయన ఇలా అంటాడు. ఇలా చూడు రాము ఈ రోజుల్లో వూరికే ఎవరూ భోజనం పెట్టరు. అంటే రాము ఇలా అంటాడు నాకు వూరికే వద్దు తాత పని ఇవ్వండి తరువాత భోజనం పెట్టండి. రా నీకు భోజనం నేను పెడతాను కానీ పని చేస్తేనే భోజనం పెడతాను అంటాడు తాత. రాము ఏం చేయాలి తాత అని అడుగుతాడు.
మా ఇంటి దగ్గర ఒక మట్టి కుప్ప వుంది. ఆ మట్టి అంతా నా పొలం లో వెయ్యాలి అంటాడు. అప్పుడు రాము అలాగే అని పని పూర్తి చేస్తాడు.
తరువాత తాత దగ్గరికి వెళ్లి పని పూర్తి చేసేసాను అని అంటాడు.అప్పుడు తాత సరే సరే వెళ్ళు వెళ్ళు అని అంటాడు . అదేంటి తాత అలా అంటున్నావ్ పని చేస్తే భోజనం పెడతానని అన్నావుగా అని అంటాడు రాము.
ఆ తాత ఇలా అంటాడు హా ఆ నేనెప్పుడూ అలా అన్నాను. భోజనం ఏంటీ, ఏదో సాయం చేస్తావేమో అని అలా అన్నాను. వెళ్ళు వెళ్ళు అని అంటాడు . అప్పుడు రాము ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడనుంచి వెళ్ళి పోతాడు.
అలా వెళ్తూ వెళ్తూ ఒక దట్టమైన అడవిలోకి వెళ్తూ ఏడుస్తూ తనలో తాను ఇలా అనుకుంటాడు. నేను ఇంకెప్పుడు ఈ ఊరిలోకి రాను ఎందుకంటే ఈ వూరిలో అందరూ చెడ్డవాల్లే ఒక్కరికీ కూడా జాలి,దయ లేదు. అలా ఏడుస్తూ ఒక దట్టమైన చెట్లు ఉన్న ప్రదేశానికి వెళ్ళిపోతాడు.
అరే ఇదేంటి నేను ఇక్కడికి వచ్చేసాను అసలే ఇక్కడ దెయ్యాలుభూతాలు వుంటాయని విన్నాను అని భయపడతాడు.అప్పుడు రాము దృష్టి అక్కడే వున్న ఒక అందమైన గుడిసె మీద పడుతుంది. ఆ గుడసె చుట్టూ ప్రక్కల వాతావరణం చాలా బాగుంటుంది. అక్కడ అందమైన పూలమొక్కలు, పల్లవృక్షాలు, ఇంకా పెద్ద జలపాతం కూడా వుంది.
బాగా ఆకలితో వున్న రాము దృష్టి అక్కడ వున్న పల్లవృక్షం మీద పడింది. రాము ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక పండు తీస్తాడు. అప్పుడు ఒక దెయ్యం హఠాత్తుగా ప్రత్యక్షమై ....
ఎవరది! నీకెంత దైర్యం, నా చెట్టు పండు తీసి తింటావా. నీకు తెలియదా ఇది నా ప్రదేశమని.
నీకు ఓ విషయం తెలుసా ఇక్కడ కి ఎవ్వరూ రారు నాకు భయపడి.
అంటే రాము వెంటనే ఆ పండు దెయ్యం దగ్గరకి విసిరేసాడు. రాము భయపడి ఏడుస్తూ నన్ను క్షమించండి. నేను చేసింది తప్పే నేను ఎందుకు ఇలా చేశాను అంటే నాకు బాగా ఆకలిగా ఉంది. మూడు రోజుల నుంచి ఏమీ తినలేదు. అని జరిగినదంతా చెబుతాడు.
అప్పుడు ఆ దెయ్యం రాము పై జాలిపడి తన మంత్రశక్తితో రాముకి భోజనం ఇస్తుంది. రాము భోజనం చూసి, మీకు ఏం పని చేసి పెట్టాలి అని అడుగుతాడు. నాకు ఏ పని చేయాల్సిన అవసరం లేదు. ముందు నువ్వు భోజనం చేయు అంటుంది.
రాము అది తిని అమ్మా నాకు ఇంతవరకు ఎవ్వరూ వూరికే భోజనం పెట్టలేదు .మీకు ధన్యవాదాలు అమ్మా . మీకు ఏ సహాయం చెయ్యాలన్న నన్ను పిలవండి అంటాడు.
అప్పుడు ఆ దెయ్యం నవ్వుతూ నేను దెయ్యాన్ని నా దగ్గర చాలా మంత్ర శక్తులు ఉంటాయి అంటుంది. నాకు ఎలాంటి సహాయం అవసరం లేదు. అని రాముకి ఇలా చెప్తుంది. నువ్వు ఎవరు ఏ సహాయం అడిగిన చేయు, కానీ వారి దగ్గర నుంచి ఏమీ ఆశించకు. వాళ్ళు ఏమి ఇచ్చిన నువ్వు తీసుకోవద్దు అని.
దానికి రాము సరే అమ్మ అంటాడు. రాము ఆ దెయ్యం ను అమ్మ అని పిలవడం వల్ల ఆ దెయ్యం ఎంతో సంతోష పడేది.
తరువాత రాముకికొంత ఆహారం ఇచ్చి ఇంటికి పంపించింది.
అప్పటి నుంచి రాము అందరికీ సహాయం చేసేవాడు కానీ వాళ్ళు ఏమి ఇచ్చినా తీసుకోక పోయేవాడు. దెయ్యం అమ్మ ఇచ్చిన ఆహారం
అయిపోయిన వెంటన మళ్లీ దెయ్యం దగ్గరకు వెళ్లి ఆహారం తిని ఇంటికి కూడా ఆహారం తెచ్చుకునేవాడు.
అలా కొద్ది రోజుల తర్వాత రాము కి జ్వరం రావడంతో ఒక వారం రోజులనుండి అమ్మ దెయ్యం దగ్గరకు వెళ్ళ లేక పోయాడు. దాంతో అమ్మ దెయ్యం రాముకు ఏమైందో అని భయపడి కంగారుగా రాము ఇంటికి వచ్చి చూసింది. రాము జ్వరంతో బయట పడుకుని ఉండటం చూసి బాధపడి రాముకి ఔషధం ఇచ్చి, రాముని చేతులతో ఎత్తుకుని తీసుకుని వెళ్లి ఇంట్లో పడుకోబెట్టింది. ఆ సమయం ఊర్లోని ప్రజలు రామును చూసి ఆశ్చర్యపోయారు. వాళ్లకి దీనమ్మ కనిపించడం లేదు. రాము మాత్రమే కనిపిస్తున్నాడు. అలా రాము గాల్లో ఇంటికి వెళ్లడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
రాము బట్టలు కూడా ఉతికి పెట్టేది. కొద్ది రోజులకి ఊర్లో ఉన్నవాళ్లకి దెయ్యం విషయం తెలుస్తుంది. ఊర్లో వాళ్ళందరూ అది రాముని బలంగా తయారు చేసి తినేస్తుంది అని అనుకుంటారు. ఆ మాటలు రాము వింటాడు. ఆ విషయం దెయ్యాన్ని అడుగుదామని వెళ్తాడు వెళ్లి అడుగుతాడు.
అప్పుడు అమ్మ దెయ్యం నవ్వి లేదు , దెయ్యం ఎప్పుడైనా మనుషుల్ని తినటం చూసావా ? మేము ఎవ్వరినీ ఏమీ అనము. కానీ మమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడితే ఊరుకోం మీరు కూడా అంతే కదా అంటుంది.
అప్పుడు రాము సరే అని వూళ్ళో కి వెళ్లి అందరికీ ఆ దెయ్యం గురించి తనకు చేసిన మేలు గురించి చెప్తాడు. ఆ దెయ్యం గురించి గొప్పగా చెప్తాడు . ఆవిడ దెయ్యం కాదు దేవత అంటాడు. అంతే కాదు నాకు అమ్మ కూడా అని చెప్తాడు.
అప్పుడు అందరూ ఆ దెయ్యం దగ్గరికి వెళ్ళి నువ్వు కూడా మాతో పాటు మా ఊరిలోనే వుండొచ్చు. అని వాళ్ళతో పాటు దెయ్యాన్ని తీసుకు వెళ్తారు. అప్పటినుంచి అందరూ కలసిమెలసి సంతోషంగా ఉంటారు. దెయ్యం రాము కి అమ్మ లాగా చూస్కుంటూ అక్కడే ఉండిపోతుంది.
- కథ ఇంకా ఉంది
- To be continued...
- తాతయ్య కథలు
- Taatayya Kathalu
- Taatayya Kathalu


0 Comments