Rabbit And The Tortoise Story In Telugu
కుందేలు - తాబేలు !
కుందేలు - తాబేలు !
కుందేలు - తాబేలు కథ!!
\
అనగనగా ఒక పెద్ద అడవి. ఆ అడవి లో చాలా జంతువులు నివసిస్తూ వుండేవి. ఒక రోజు ఆ అడవిలో వుండే కుందేలు తాబేలు తో ఇలా అంటుంది. మనం పరుగు పందెం పెట్టుకుందాం ఎవరూ గెలుస్తారో చూద్దాం అని.
అప్పుడు అడవి లో జంతువులు తాబేలుతో నీవు కుందెలుతో పోటీపడి గెలవలేవు, కాబట్టి నీవు పోటీలో పాల్గొనవద్దు అని కుందేలు తో అంటాయి.
ఆ మాటలు విన్న తాబేలు నిరాశ చెందకుండా తనను తాను నమ్ముకుని పోటీకి సిద్ధపడుతుంది. అది చూసి జంతువులన్నీ ఆశ్చర్యపోతాయి. కొన్ని జంతువుల హాస్యాస్పదంగా నవ్వుతాయి. అయినప్పటికీ తాబేలు వెనకడుగు వేయకుండా కుందెలుతో పోటీకి సిద్ధం అవుతుంది.
జంతువులన్నీ కలిసి ఈ పోటీకి న్యాయనిర్ణేతగా నక్క బావను నియమిస్తాయి. నక్క బావ పరుగు పందెం పోటీ యొక్క నియమాలను చెబుతాడు.
అడవిలో ఈ మూలన ఉన్న చెట్టు నుంచి మైలు దూరంలో మర్రి చెట్టు వద్ద వున్న గీతను ఎవరు ముందుగా చేరుకుంటారో వారే విజేత అని చెబుతాడు. దానికి తాబేలు కుందేలు సరే అని పరుగుపందెం కు సిద్ధమవుతాయి.
జంతువులన్నీ చూస్తుండగానే నక్కబావ ఆధ్వర్యంలో పరుగు పందెం ప్రారంభం అవుతుంది. ప్రారంభమైన వెంటనే కుందేలు చెంగు చెంగున పరుగుపెట్టి వెళ్ళిపోతుంది.
తాబేలు మాత్రం నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తుంది. కొద్ది దూరం వెళ్ళిన కుందేలు తాబేలు ఎక్కడ ఉందో అని చూడబోయి వెనుకకు తిరిగి చూసి తాబేలు అక్కడ ఎక్కడో ఉంది. నేను ఇక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుని తాబేలు వచ్చేసరికి లేచి తాబేలు కంటే ముందే వెళ్ళవచ్చు. అని ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ నిద్ర పోతుంది.
ఇంతలో తాబేలు నెమ్మదిగా నడుచుకుంటూ కుందేలు ని దాటి వెళ్ళిపోతుంది. కుందేలు నిద్రలేచేసరికి తాబేలు మర్రిచెట్టు దగ్గర ఉన్న గీత వద్దకు వెళ్లి గమ్యాన్ని చేరుకుంటుంది. అప్పుడు ఆ గీత దగ్గర ఉన్న నక్క బావ, ఈ పరుగుపందెంలో తాబేలు విజేత అని ప్రకటిస్తుంది.
అప్పుడు జంతువులన్నీ ఆనందంతో ఉరకలు వేస్తూ తాబేలును ఎంతో మెచ్చుకుంటాయి.
నీతి:
ఈ కథలో మనకు అర్థం అయింది ఏమిటి అంటే ఎవరిని ఎవరు తక్కువ అంచనా వేసుకోకూడదు నిదానమే ప్రధానం.
- తాతయ్య కథలు.
- Taatayya Kathalu
- Taatayya Kathalu



0 Comments