Ramu, Somu And The Bear Story In Telugu

Ramu, Somu And The Bear Story In Telugu

రాము, సోము, ఎలుగుబంటి కథ!!




రాము - సోము - ఎలుగు బంటి కథ !

నగనగా లక్ష్మీపురం అనే ఒక ఊరు. ఆ ఊరిలో రాము, సోము అనే ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉండేవారు. వాళ్ళిద్దరూ కలసి మెలసి వుండేవాళ్ళు. ఏ పని చేసినా, ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్ళేవారు.

 ఒక రోజు ముఖ్యమైన పని మీద పొరుగు ఊరే వెళ్తున్నారు. మార్గ మధ్యలో అడవిని దాటుతుండగా అకస్మాత్తుగా ఒక ఎలుగుబంటి కనిపించింది. 

వెంటనే ఇద్దరికి ఏం చేయాలో తోచలేదు. ఇంతలో ఆ ఎలుగుబంటి వీళ్ళను చూసి దగ్గరకు రాసాగింది. 

అప్పుడు వెంటనే సోము రాముని విడిచిపెట్టి పక్కనే ఉన్న పొడవైన చెట్టు ను చూసి ఎక్కేసాడు. ఎలుగుబంట్లు పొడవైన చెట్టు ఎక్కలేదు కదా!  అక్కడి నుంచి కిందకు చూడసాగాడు. అయితే రాముకి చెట్లు ఎక్కడం రాదు.  ఎలుగుబంటి రాముని సమీపిస్తుంది. 

కష్ట సమయంలో తన స్నేహితుడు తనను విడిచిపెట్టి వెళ్లిపోవడం చూసిన రాముకి ఏం చేయాలో దిక్కు తోచలేదు. 

రాముకి వెంటనే ఒక ఉపాయం తట్టింది. ఎలుగుబంట్లు చనిపోయిన వాటిని తినవు. కాబట్టి నేను చనిపోయినట్లు నటిస్తే తనను కూడా తినకుండా విడిచి పెట్టొచ్చు అనుకున్నాడు. 

అనుకున్నదే తడువుగా... హఠాత్తుగా నేలపై వెల్లకిలా పడుకున్నాడు. కాసేపు చనిపోయిన వ్యక్తిలా ఊపిరిని నిలిపి పెట్టుకున్నాడు. 


ఆ వెలుగుబంటి కింద పడి ఉన్న రాము దగ్గరికి వచ్చి  క్షుణ్నంగా పరిశీలించ సాగింది. ఇదంతా చెట్టు పైనుండి సోము చూస్తున్నాడు. ఎలుగుబంటి రాము చెవిలో ఏదో చెప్తోంది అనుకున్నాడు. 

కాసేపటి తరువాత ఎలుగుబంటి రాము చనిపోయాడు అనుకుని అక్కడినుంచి వెళ్లిపోయింది. 

వెంటనే చెట్టు పై నుండి సోము క్రిందకు దిగి రాము దగ్గరకు వచ్చాడు. చనిపోయిన వ్యక్తిలా నటిస్తున్న రాముని లేపి ఎలుగుబంటి వెళ్లిపోయింది అని చెప్పాడు. ఆ మాట విన్న రాము ఒక్క సారిగా ఊపిరి పీల్చుకుని పైకి లేచాడు. 

అప్పుడు సోము ఎంతో ఆత్రుతతో ఎలుగుబంటి నీ చెవిలో ఏం చెప్పింది అని రాముని అడిగాడు. దానికి సమాధానంగా రాము "ఎలుగుబంటి నా చెవిలో చెడ్డ వాళ్లతో స్నేహం మంచిది కాదు" అని చెప్పింది, అంటాడు. 

ఆ మాటకు కంగుతిన్న సోము సిగ్గు తో తల దించుకున్నాడు. తన స్నేహితుడైన  రాముని క్షమించమని అడిగాడు.



- తాతయ్య కథలు.

- Taatayya Kathalu

Post a Comment

0 Comments