Tenali Ramakrishna Story In Telugu - Rasagulla Veru Katha

Tenali Ramakrishna Story In Telugu - Rasagulla Veru Katha In Telugu





తెనాలి రామకృష్ణుని కథలు - రసగుల్లా వేరు కథ!


ఒకానొక సమయంలో శ్రీకృష్ణదేవరాయలు వారి ఆస్థానానికి పశ్చిమ ఆసియా దేశాల నుంచి వర్తక వాణిజ్య ఒప్పందాల విషయమై ఒక రాజు వచ్చారు. అతని పేరు అబ్దుల్.

శ్రీకృష్ణదేవరాయలు గారు వారిని అత్యంత గౌరవనీయమైన అతిధి మర్యాదలతో సత్కరించారు. విందు ముగించిన తరవాత భారతీయ సంస్కృతిలో భాగంగా తీపి వంటకమైనటువంటి రసగుల్లా ఇవ్వమని శ్రీ కృషణదేవరాయలు చెప్పారు. మంత్రివర్యులు శ్రీ కృష్ణ దేవరాయలు చెప్పినట్టు చేశారు. రసగుల్లా తిన్న తరువాత ఆ రాజు రసగుల్లా యొక్క రుచిని మెచ్చుకుని ఒక వింత కోరిక ను కోరారు.

దానికి ఆశ్చర్యపడిన మంత్రివర్యులు వెంటనే శ్రీకృష్ణదేవరాయలు వద్దకు వచ్చి, మహా ప్రభు.. మనకు ఒక పెద్ద సమస్య వచ్చి పడింది అని అన్నారు. 

దానికి శ్రీ కృష్ణదేవరాయలు వారు ఏమిటి అని ప్రశ్నించగా.. మన అతిథిగా వచ్చిన అబ్దుల్  రాజు గారు కి మీరు చెప్పినట్టే రసగుల్లాలు రుచి చూపించాము. ఆయన తిన్న వెంటనే దాని యొక్క రుచిని ఎంతో మెచ్చుకొని తనకు వెంటనే రసగుల్లా వేరు కావాలని అడుగుతున్నారు. ఆ వేరు తీసుకువెళ్లి తమ రాజ్యంలో నాటుతారంట.. అని మంత్రివర్యులు శ్రీకృష్ణదేవరాయల తో చెప్పారు.


ఈ సమస్య విన్న శ్రీ కృష్ణ దేవరాయలు వెంటనే ఆలోచనలో పడ్డారు. ఇంతలో అక్కడికి వచ్చిన తెనాలి రామకృష్ణునికి ఈ సమస్యను వివరించారు. ఆయన వెంటనే నవ్వుకుని ఇది చాలా సులువైన సమస్య అని చెప్పారు.

దానికి శ్రీకృష్ణదేవరాయలవారు ఆగ్రహించి, మేమంతా తలలు పట్టుకుని పరిష్కారం కోసం సతమతమౌతుంటే నువ్వు నవ్వుతావా అని రామకృష్ణ పై కోపం తెచ్చుకున్నారు.


వెంటనే రామకృష్ణుడు అవును మహాప్రభో, ఇది చాలా చిన్న సమస్య. దీనిని నేను సులభంగా పరిష్కరించగల అని అన్నాడు.

దానికి శ్రీకృష్ణదేవరాయలు వారు సరే అయితే, ఈ సమస్య పరిష్కారం జరిగితే మీకు అమూల్యమైన బహుమతి లభిస్తుంది లేదా నీకు కఠినమైన శిక్షను విధిస్తాను అని అన్నారు. 

దానికి వికటకవి రామకృష్ణుడు అంగీకరించి రెండు గంటల్లో వస్తానని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. 

రాజసభ లో అందరూ కుతూహలంతో ఎదురు చూస్తున్నారు.  రామకృష్ణుడు ఏవిధంగా రసగుల్లా వేరు తీసుకొని వస్తాడు అని తలలు పట్టుకుని కూర్చున్నారు.

ఇంతలో రామకృష్ణుడు రానే వచ్చాడు. మహాప్రభు నేను చెప్పినట్టుగానే రెండు గంటల్లో రసగుల్లా వేరును తీసుకుని వచ్చాను అని అన్నాడు.

దానికి వెంటనే శ్రీ కృష్ణదేవరాయలు వారు కుతూహలంతో ఏది చూపించు అని అన్నారు. దానికి సమాధానంగా రామకృష్ణుడు క్షమించండి మహారాజా, మీకు చూపించలేను. నేను నేరుగా అబ్దుల్ రాజుగారికి చూపిస్తాను.. అని అన్నాడు. దానికి శ్రీకృష్ణదేవరాయల వారు సరే అని అబ్దుల్ రాజు వద్దకు పంపించారు. 

తెనాలి రామకృష్ణుడు తాను తెచ్చినటువంటి రసగుల్లా వేరును అబ్దుల్ రాజు గారికి ఇచ్చాడు. అతడు వెంటనే దాన్ని రుచి చూసి తెనాలి రామకృష్ణుని ఎంతో మెచ్చుకొని దీనిని వెంటనే మా రాజ్యానికి తీసుకునిపోయి అక్కడ మా రైతులుకు నాటమని ఇస్తాను అని అన్నాడు. 

అదేవిధంగా శ్రీకృష్ణదేవరాయలు కూడా ధన్యవాదాలు చెప్పి అక్కడి నుంచి అబ్దుల్ రాజుగారు పయనమయ్యారు.


దానికి ఆశ్చర్యపోయిన టువంటి శ్రీకృష్ణదేవరాయలు వారు వెంటనే తెనాలి రామకృష్ణుడి ఈ విధంగా అడిగారు.. రామకృష్ణ నువ్వు ఏమి ఇచ్చా వో గాని ఆయన వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోయారు. లేదంటే మన రాజ్యం గౌరవం పోయేది. నువ్వు ఈరోజు మన రాజ్యం యొక్క గౌరవ ప్రతిష్టలను కాపాడావు ఇంతకీ ఏమి ఇచ్చి రాజు గారుని పంపించావు.. అని అడిగారు. 



దానికి సమాధానంగా రామకృష్ణుడు ఈ విధంగా అన్నాడు.. మహారాజా నేను ఇచ్చింది కేవలం చెరుకుగడ ముక్క మాత్రమే అని అన్నాడు. దానిని చూసినటువంటి అబ్దుల్ రాజు గారు అది రసగుల్లా వేరు అనుకుని తీసుకుని వెళ్ళిపోయారు అని చెప్పాడు.


శ్రీకృష్ణదేవరాయల వారు ఆశ్చర్య పోయి రామలింగడి బుద్ధి చతురతకి మెచ్చుకుని తెనాలి రామకృష్ణుని కి ఎన్నో కానుకలు ఇచ్చారు.


ఈ విధంగా తెనాలి రామకృష్ణుడు విజయనగర సామ్రాజ్యం యొక్క గౌరవ ప్రతిష్టలను ఎన్నో సార్లు తన తెలివి తేటలతో కాపాడాడు. అందుకే రామకృష్ణుడు అంటే రాజుకు ఎంతో మక్కువ.



-Taatayya Kathaluu

Post a Comment

0 Comments